శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (19:12 IST)

బాల‌కృష్ణ‌కు స‌ర్జ‌రీ నిజ‌మేనా!

Balakrishna
Balakrishna
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవ‌లే ఆసుప్ర‌తికి వెళ్ళారు. అక్క‌డ ట్రీట్‌మెంట్ తీసుకుని ఇంటికి వ‌చ్చారు. అపోలో డాక్ట‌ర్లు ప‌ర్య‌వేక్షించారు. అయితే ఇటీవ‌లే ఆయ‌న మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు. ఇందులో రెండు పాత్ర‌లు పోషిస్తున్నారు. అందులో ఒక‌టి సీనియ‌ర్ బాల‌కృష్ణ‌లాగా వుంటుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను ఇటీవ‌లే ముచ్చంత‌ల్‌లో చిత్రీక‌రించారు. యాగ‌శాల‌లో ఆ చుట్టు ప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌ల‌కు పెండ్లిల్లు చేసి శుభ‌సూచ‌కంగా యాగం చేయిస్తుండ‌గా, కొంద‌రు రౌడీలు వ‌చ్చి చిద్రం చేస్తారు. దాంతో బాల‌య్య రెచ్చిపోతారు.
 
ఈ షూటింగ్ త‌ర్వాత బాల‌య్య‌కు దెబ్బ‌లు త‌గిలాయ‌ని అందుకే ఆసుప‌త్రికి వెళ్ళార‌ని వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీనికి మంగ‌ళ‌వారంనాడు బాల‌కృష్ణ టీమ్ ఓ పోస్ట్ విడుద‌ల చేసింది. బాల‌కృష్ణ‌గారికి ఎటువంటి సర్జరీ జరగలేదు, ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కొరకు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది.ఈ రోజు ఆయన సారధి స్టూడియోస్ లో #NBK107 షూటింగ్‌లో పాల్గొన్నారు అని తెలియ‌జేసింది. సో. బాల‌య్య ఫ్యాన్స్ కంగారుప‌డాల్సిన ప‌నిలేదు.