శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (13:17 IST)

బాల‌కృష్ణ‌తో అనిల్ రావిపూడి చిత్రం జూన్‌లో ప్రారంభం

Balakrishna, Anil Ravipudi
Balakrishna, Anil Ravipudi
అఖండ‌తో క‌లెక్ష‌న్ల ప‌రంప‌ర‌ను అందుకున్న నంద‌మూరి బాల‌కృష్ణ బుల్లితెర‌పైనా సంచ‌ల‌నం సృష్టించారు. ఇటీవ‌లే శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా ఏప్రిల్ 10న టీవీలో విడుద‌లైన అఖండ చిత్రం 13.13. టీఆర్‌పి. రేటింగ్‌లో అగ్ర‌స్థానంలో నిల‌వ‌డం విశేషం.
 
బాల‌కృష్ణ తాజాగా మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో 107వ సినిమాను చేస్తున్నారు. ఇప్ప‌టికే స‌గ‌భాగం పూర్త‌యిన ఈ చిత్రంలో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత 108వ సినిమాగా  ఎఫ్‌.3. దర్శకుడు అనిల్ రావిపూడితో చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని అనిల్ రావిపూడి ప్ర‌క‌టించారు. 
 
జూన్ 10న బాలకృష్ణ‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం కూడా యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వుంటుందని తెలుస్తోంది. మునుపెన్నడూ చూడని పాత్రలో బాలయ్య తెరపై కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఈ సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.