శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (12:00 IST)

"ఎఫ్-3" నుంచి 'ఊ .. ఆ.. అహ... అహా' అంటూ లిరికల్ సాంగ్

tamannah
హీరో వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం "ఎఫ్-3". ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుుకురానుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. 
 
ఆయన స్వరపరిచిన 'ఊ ఆ అహ అహ' అనే పాటను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సునిధి చౌహాన్ .. లవిత లోబో.. సాగర్.. అభిషేక్ ఆపించారు. ప్రధానమైన జంటలపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ ఇది.
 
ఈ పాటలో తమన్నా.. మెహ్రీన్‌తో పాటు సోనాల్ కూడా మెరవడం విశేషం. మాస్ ఆడియన్స్ కోసం దేవిశ్రీ చేసిన ఈ ట్యూన్ వాళ్లకి కనెక్ట్ అయ్యేలానే ఉంది. రాజేంద్రప్రసాద్.. సునీల్.. అంజలి.. సంగీత ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ కానుంది.