గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (16:29 IST)

కిండర్ చాక్లెట్లలో ప్రమాదకర బ్యాక్టీరియా - 151 మందికి అస్వస్థత

kinder
చిన్నారుల నుంచి పెద్దల వరకు అమితంగా ఇష్టపడే కిండర్ చాక్లెట్లలో ప్రమాదకర సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది. ఈ చాక్లెట్లను ఆరగించిన 151 మంది చిన్నారులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన బెల్జియం దేశంలోని అర్లోన్ నగరంలో జరిగింది. 
 
ఫెర్రెరో కార్పొరేట్ ప్లాంట్‌లో తయారయ్యే జాయ్ చాక్లెట్లు ఆరగించిన చిన్నారుల్లో 151 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ చాక్లెట్లను ఆరగించిన చిన్నారులు అతిసారం, వాంతులతో బాధపడుతుండటాన్ని వారి తల్లిదండ్రులు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా, యూఎస్ ఆహార భద్రతా న్యాయ సంస్థ నివేదిక ప్రకారం 2021 డిసెంబరులో చాక్లెట్ల తయారీ పదార్థాలలో సాల్మొనెల్లా టెఫి మ్యురియమ్ అనే బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. అలాంటి పదార్థాలతో తయారైన కిండర్ చాక్లెట్లను తినడం వల్ల చిన్నారులు అస్వస్థతకు లోనవుతున్నట్టు పేర్కొంది. సాల్మొనెల్లా జాతి బ్యాక్టీరియా చాలా ప్రమాదకరమైనదిగా యూఎస్ ఆహార సంస్థ వెల్లడించింది.