శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (15:49 IST)

ఉక్రెయిన్‌లో 165 మంది చిన్నారులను చంపేసిన రష్యా.. ఉక్రెయిన్ ఆరోపణ

Russia-Ukraine war
ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యా బలగాలు ఆ దేశంలో దమనకాండను సాగిస్తుంది. ఏమాత్రం విచక్షణ లేకుండా ఉక్రెయిన్ ప్రజలను హతమార్చుతుంది. రష్యా సైనికులు జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 165 మంది చిన్నారులు చనిపోయారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దండయాత్ర మంగళవారానికి 41వ రోజుకు చేరుకుంది. 
 
మరోవైపు, బుచా సహా పలు నగరాల్లో రష్యా దళాలు, పౌరులు చంపడం, ఇతర యుద్ధ నేరాలపై తాము ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళాతమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. అదేసమయంలో ఉక్రెయిన్‌లో రష్యా బలంగాలు సాగించిన మారణహోమంపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మంగళవారం అత్యవసరంగా భేటీకానుంది.