శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (17:43 IST)

6 నుండి 12 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

covaxin
కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వున్నాయి. మన దేశంలో కరోనా  ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కరోనా కట్టడి చర్యలు చేపట్టింది. దీనితో కరోనా కట్టడి కోసం అందరికి వ్యాక్సిన్ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
ఇప్పటివరకు 12 యేళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులో ఉండగా ఇప్పుడు 6నుండి పన్నెండేళ్లలోపు  పిల్లలందరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది డీసీజీఐ. దీంతో ఇకనుండి పుట్టిన పిల్లల నుండి ఆరేళ్లలోపు పిల్లలకు మినహా అన్ని వయసుల వారు  వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
 
ప్రస్తుతం దేశంలో కరోనా నియంత్రణ కోసం కరోనా కేసుల సంఖ్య పిల్లల్లో అధికంగా కనిపిస్తుండడంతో పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం సిద్దమయింది. 2 నుండి 12ఏళ్ల పిల్లలకు తమ కోవాగ్జీన్  వ్యాక్సిన్ ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని భారత్ బయోటెక్ డీసీజీఐకి ప్రతిపాదనలు పంపింది. భారత్ బయోటెక్ పంపిన ప్రతిపాదనలపై కోవాగ్జీన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.