ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (20:17 IST)

కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ షాట్స్.. రూ.225కే లభ్యం

covishield
కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ షాట్స్ అందుబాటులోకి రానున్నాయి. అయితే మార్కెట్లోకి వచ్చీ రాగానే వ్యాక్సిన్ ధర తగ్గిపోయింది. సగం కంటే తక్కువగా అంటే రూ.600 నుంచి రూ.225కి పడిపోయింది. 
 
ఈ విషయాన్ని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్ పూనావాలా ధర తగ్గించినట్లు స్వయంగా వెల్లడించారు. కేంద్రంతో జరిపిన పలు చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
 
కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ అయిన కొవీషీల్డ్ ను ప్రైవేట్ హాస్పిటల్స్‌కు రూ.600కు బదులుగా రూ.225కే అందిస్తున్నామని తెలియజేశారు. 
 
కేంద్రం నిర్దేశించినట్లుగా 18సంవత్సరాల పై బడిన వారంతా ప్రికాషనరీ డోసుగా కొవీషీల్డ్‌ను తీసుకోవచ్చునని ట్వీట్ చేశారు.