మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (10:27 IST)

బహిరంగ మార్కెట్‌లో వ్యాక్సిన్లు... ధరలు ఎంతంటే..

ప్రస్తుతం కరోనా వైరస్ సోకినప్పటికీ ప్రాణాపాయం లేకుండా ఉండేందుకు వీలుగా టీకాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కోవిషీల్డు, కోవాగ్జిన్ టీకాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఈ టీకాలనే ఇపుడు వేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ రెండు టీకాలకు బహిరంగ మార్కెట్ ధరను ఖరారు చేశారు. 
 
ఈ రెండు టీకాల ఒక్కో డోసు టీకా ధర రూ.275గా ఖరారు చేయగా, సర్వీసు చార్జీల రూపంలో మరో రూ.150ను అదనంగా వసూలు చేయనున్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ధరలు ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవాగ్జిన్ ధర రూ.1200గాను, కోవిషీల్డ్ ధర రూ.780 లభ్యమవుతుంది. 
 
అయితే, ఇప్పటివరకు కేవలం ప్రైవేటు ఆస్పత్రులకే పరిమితమై ఈ రెండు టీకాలను ఇకపై బహిరంగ మార్కెట్‌లోకి తెచ్చేందుకు వీలుగా భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ)కు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తును కోవిడ్ నిపుణుల కమిటి పరిశీలించి అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.