మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (11:29 IST)

చిన్నారులపై బ్రహ్మాండంగా పనిచేస్తున్న కోవాగ్జిన్ టీకా

ప్రపంచ దేశాలను కరోనా పట్టి పీడిస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచివున్న నేపథ్యంలో బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా చిన్నారులపై బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. 
 
పిల్లలపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చినట్టు పేర్కొంది. 12-18 ఏళ్ల లోపు పిల్లలకు ఇచ్చేందుకు ఇటీవలే ఈ టీకాకు డీసీజీఐ నుంచి అత్యవసర అనుమతి లభించింది.
 
ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు మధ్య మొత్తం 525 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. అంతకంటే ముందు వీరిని వయసుల వారీగా మూడు బృందాలుగా విభజించారు. 
 
ఈ పరీక్షల్లో మంచి ఫలితాలు కనబరిచినట్టు భారత్ బయోటెక్ తెలిపింది. పెద్దల కంటే పిల్లల్లోనే న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు 1.7 రెట్లు అధికంగా కనిపించినట్టు పేర్కొంది.