శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 డిశెంబరు 2021 (11:15 IST)

12 యేళ్లు పైబడిన వారికి కోవాగ్జిన టీకాలు - అనుమతిచ్చిన డీసీజీఏ

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బుసలుకొడుతోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే 400కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో 12 యేళ్లుపైబడిన వారికి కరోనా టీకాలు వేసేందుకు కేంద్రం సిద్ధమైంది. 12 నుంచి 18 యేళ్ళలోపు భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ టీకాలు వేయనున్నారు. 
 
ఇందుకోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఏ) అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి తర్వాత చిన్నారులకు ఇచ్చేందుకు అనుమతులు పొందిన రెండో టీకా ఇదే కావడం గమనార్హం. ఈ టీకా మొదటి డోస్ వేసిన 28 రోజుల్లో రెండో డోస్ టీకా వేస్తారు. ఈ టీకాతో పిల్లలకు కరోనా నుంచి రక్షణ లభిస్తుందని క్లినికల్ పరీక్షల్లో వెల్లడైనట్టు భారత్ బయోటెక్ తెలిపింది. 
 
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఈ నెల 20వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ నిర్ధారణ అయింది. ఈయన ప్రకాశం జిల్లా వాసి. అలాగే, మరో వ్యక్తికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ నెల 16వ తేదీన సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు అక్కడ నుంచి ఒంగోలుకు వచ్చిన ఈ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ రెండు కేసులో కొత్తగా వెలుగు చూశాయి. దీంతో వీరిద్దరితో కాంటాక్ట్ అయిన సెకండరీ కాంటాక్ట్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే, అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 
 
422కు చేరిన ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు ఇప్పటివరకు మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 422కు చేరింది. అలాగే, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,987కు చేరుకుంది. ఇదిలావుంటే, ఈ వైరస్ బారినపడి మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 162కు చేరింది. 
 
ఇకపోతే, ఈ వైరస్ నుంచి 7,091 మంది కోలుకున్నారు. మరో 162 మంది మృత్యువాతపడ్డారు. ఒమిక్రాన్ వైరస్ బారినపడిన వారిలో 130 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 76,766 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే, ఇప్పటివకు దేశంలో కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,79,682కు చేరింది.