సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (10:43 IST)

కరోనా లక్షణాల నుంచి 93.4 శాతం రక్షణ కల్పిస్తున్న కోవాగ్జిన్

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందస్తు టీకాలకు అనుమతి ఇచ్చింది. దీంతో అనేక ప్రపంచ దేశాల్లోని ఔషధ దిగ్గజ కంపెనీలు వివిధ రకాలైన టీకాలను అభివృద్ధి చేశాయి. అలాంటి వాటిలో కోవాగ్జిన్ ఒకటి. ఇది తీవ్రమైన కొవిడ్ లక్షణాల నుంచి 93.4 శాతం రక్షణ కల్పిస్తుందని భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. 
 
కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను లాన్సెట్‌ జర్నల్​ వెల్లడించిన నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ ప్రకటన చేసింది. కొవిడ్​ లక్షణాలు ఉన్నవారిలో 77.8 శాతం, కరోనా లక్షణాలు లేని వారిలో 63.6 శాతం మేర సమర్థంగా పని చేస్తున్నట్లు తేలిందని లాన్సెట్​ తెలిపింది. 24 మంది వ్యాక్సిన్​ తీసుకున్నవారు, 106 మంది ఇతరులు సహా మొత్తం 130 మందిపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది. 
 
డెల్టా వేరియంట్​పై 65.2 శాతం, ఇతర అన్ని రకాల కొవిడ్​ స్ట్రెయిన్ల నుంచి 70.8 శాతం రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేసింది.క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో 12 శాతం మందిలో చిన్న చిన్న సమస్యలు బయటపడగా.. 0.5 శాతం కంటే తక్కువ మందిలో మాత్రమే తీవ్ర దుష్పరిణామాలు తలెత్తినట్లు తెలిపింది లాన్సెట్​. కొవాగ్జిన్‌ 3వ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలపై ఐసీఎంఆర్‌ డీజీ బలరాం భార్గవ హర్షం వ్యక్తం చేశారు.