సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 మార్చి 2022 (22:15 IST)

కోవిషీల్డ్ డోసుల మధ్య విరామంపై కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్ డోసుల మధ్య విరామాన్ని 12 నుంచి 16 వారాలుగా ఉండగా, సమయాన్ని 8 నుంచి 16 వారాలకు తగ్గించింది. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ కేంద్రానికి సిఫార్సు చేసింది. 
 
మరోవైపు, కోవాగ్జిన్ రెండు డోసుల మధ్య ఉన్న 28 రోజుల విరామంలో ఎలాంటి మార్పులేదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ - ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించాయి. దీన్ని భారత్‌కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున ఉత్పత్తిచేసింది. ఇకపోతే కోవాగ్జిన్‌ను భారత్‌కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసిన విషయం తెల్సిందే.