సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (14:21 IST)

హిందువులు ఎక్కువ మందిని కనాలి : యతి సత్యదేవానంద్ సరస్వతి

Satyadevanand Saraswati,
దేశంలో ముస్లింలు జనాభాపరంగా మెజార్టీ సాధిస్తే భారత్ ముస్లిం దేశంగా మారిపోతుందని అందువల్ల హిందువులు మరింత మందిని కనాలని అఖిల భారత సంత్ పరిషత్‌కు చెందిన స్వామి యతి సత్యదేవానంద్ సరస్వతి పిలుపునిచ్చారు. రానున్న దశాబ్దాల్లో భారత్ హిందువులు తక్కువుగా ఉన్న దేశంగా మారకుండా ఉండాలంటే హిందువులు మరింత మంది పిల్లన్ని కనాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముబారక్ పూర్‌లో మూడు రోజుల పాటు ధర్మ సంసద్ జరుగుతోంది. ఈ సందర్భంగా అఖిల భారతీయ సంత్ పరిషత్ హిమాచల్ ప్రదేశ్ ఇన్‌చార్జ్ యతి సత్యదేవానంద్ సరస్వతి కూడా పాల్గొన్నారు. ఇందులో ఆయన కీలక ప్రసంగం చేశారు. 
 
"భారత్ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉన్నారు. కానీ, ముస్లింలు ఒక ప్రణాళిక ప్రకారం ఎక్కువ మందిని కంటూ తమ సంతతిని పెంచుకుంటున్నారు. ముస్లింలు మెజార్టీ సాధిస్తే పాకిస్థాన్ మాదిరిగానే భారత్ కూడా ఇస్లామిక్ దేశంగా మారిపోతుంది. దీన్ని నివారించేందుకే హిందువులు మరింత మంది పిల్లన్ని కనాలని తమ సంస్థ కోరుతుంది" అని పిలుపునిచ్చారు.