మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (08:04 IST)

రూపాయికే పెట్రోల్... ఎక్కడ.. ఎందుకు?

petrol
దేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలకు అడ్డే లేకుండా పోతుంది. దీంతో దేశంలోన్ని అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సెంచరీని దాటిపోయింది. దీంతో బండి తీయాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఓ పెట్రోల్ బంక్ యజమాని ఒక్క రూపాయికే ఒక లీటర్ పెట్రోల్ పంపిణీ చేశారు. 
 
మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఓ పెట్రోల్ బంక్ యజమాని ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ బంపర్ ఆఫర్ ప్రకటించారు. రూపాయికే పెట్రోల్ అంటూ ప్రకటన ఇచ్చారు. 
 
దీంతో వాహనదారులు ఆ పెట్రోల్ బంక్ వద్దకు భారీగా తరలివచ్చారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది. అయితే, రూపాయికే లీటర్ పెట్రోల్ ఆఫర్ మాత్రం మొదట వచ్చిన 500 మంది వాహనదారులు మాత్రమే అందించారు. దీంతో మిగిలినవారు తీవ్ర నిరుత్సాహంతో వెనుదిరిగారు.