గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (10:04 IST)

రెచ్చిపోతున్న కామాంధులు.. భారీ బల్లిపై సామూహిక అత్యాచారం

Lizard
Lizard
కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలపై కాదు.. మూగజీవులపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మేక, ఆవులపై అత్యాచార ఘటనలు నమోదైన నేపథ్యంలో తాజాగా భారీ బల్లి.. బెంగాల్ మానిటర్ లిజర్డ్‌పై నలుగురు వేటగాళ్లు అత్యాచారానికి పాల్బడ్డారు. మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గభా ప్రాంతంలోని టైగర్ రిజర్వ్ కోర్ జోన్‌లోకి ప్రవేశించిన నిందితులైన వేటగాళ్లు ఈ దారుణ నేరానికి పాల్పడ్డారు. నిందితులను సందీప్ తుక్రామ్, పవార్ మంగేష్, జనార్దన్ కామ్టేకర్, అక్షయ్ సునీల్‌గా గుర్తించారు.
 
మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు ఓ నిందితుడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు నలుగురు ఈ భారీ బల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలను వారు తమ మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో అడవిలో తిరుగుతున్న వీరిని గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో విషయం బయటపడింది.