శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (14:39 IST)

థానేలో బర్డ్‌ఫ్లూ - 25 వేల కోళ్లు చంపేయాలని ఆదేశం

మహారాష్ట్రలోని థానేలో బర్డ్‌ఫ్లూ కలకలం చెలరేగింది. జిల్లాలోని వెహ్లోలిలో ఉన్న ఓ పౌల్ట్రీలో వందల కోళ్లు ఆకస్మికంగా మృత్యువాతపడ్డాయి. బర్డ్ ఫ్లూ కారణంగానే ఈ కోళ్లు చనిపోయాని స్థానిక అధికారులు భావిస్తున్నారు. 
 
దీంతో ఈ కోళ్ల నమూనాలను సేకరించి పూణెలోని పరిశోధనాశాలకు పంపించారు. వైరస్ వ్యాప్తి మరింతగా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని పశుసంవర్థక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. 
 
అంతేకాకుండా, కొన్ని వెహ్లోలీకి కొన్ని కిలోమీటర్ల పరిధిలోని సుమారు 25 వేల కోళ్ళను చంపేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. వ్యాధి వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
కాగా. జిల్లాలో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా కారణంగానే పక్షులు కూడా చనిపోయాని థానే జెడ్పీ సీఈవో డాక్టర్ బహుసాహెబ్ దంగ్డే వెల్లడించారు.