గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (10:29 IST)

బర్త్ డేకు వెళ్తే కూల్ డ్రింక్స్‌లో మత్తుమందిచ్చి సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

soft drinks
బర్త్ డే పార్టీ కోసం వెళ్లిన యువతిపై తోటి స్నేహితులే అత్యాచారానికి పాల్పడిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. బర్త్ డే పార్టీ పేరిట ఇంటికి ఆహ్వానించి కూల్‌డ్రింక్స్‌లో  మత్తు మందు కలిపి ఇచ్చి తాగించారు. ఆమె అపస్మారక స్థితిలోనికి చేరుకోగానే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థులు తోటి విద్యార్థినిని బర్త్ డే వేడుకలకు ఆహ్వానించారు. ఆ తర్వాత.. బాలికకు కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చారు. ఆ తర్వాత.. బాలిక ఇంటికి చేరుకునే సరికి అపస్మారక స్థితిలో ఇంటికి చేరుకుంది. 
 
బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. బాలిక తల్లిదండ్రులు అపస్మారక స్థితిలోనికి చేరుకుంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
బాలికపై సాముహిక అత్యాచారం చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో స్థానిక టీఎంసీ నాయకుడి కుమారుడు ఉన్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు.. బ్రజగోపాల్‌ను అరెస్టు చేశారు.