ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (09:52 IST)

ప్రియురాలిపై అత్యాచారం.. వీడియో చిత్రీకరణ.. ఆపై ఫ్రెండ్స్‌కు అప్పగింత

victim
ప్రేమ పేరుతో ఓ బాలికను యువకుడు మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాన్ని వీడియో తీశాడు. ఆ తర్వాత తన స్నేహితులకు అప్పగించడంతో వారు కూడా లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన బెంగుళూరు నగర శివారు ప్రాంతమైన యలహంకలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యలహంక ప్రాంతానికి చెందిన 15 యేళ్ల బాలికను ప్రేమిస్తున్నట్టు 25 యేళ్ళ యువకుడు నమ్మించాడు. పిమ్మట పెళ్ళి విషయమై మాట్లాడేందుకు చెప్పడంతో ఆ యువతి అతని మాటలు నమ్మింది, ఆ యువకుడి వెళ్ల వెళ్లింది. ఈ క్రమంలో యలహంకలోని ఓ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న నిందితుడి స్నేహితుడు ఈ ఘటనను సెల్‌ఫోలను చిత్రీకరించాడు. 
 
ఆ తర్వాత ఆ వీడియోను బాధిత బాలికకు పంపించి వేధించసాగాడు. తన స్నేహితులకు డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించసాగాడు. దీంతో భయపడిన ఆ బాలిక కొంత డబ్బులు సేకరించి వారికి ఇచ్చింది. అయితే, డబ్బులు తీసుకున్న తర్వాత ఆ కామాంధులు బాలికను వదిలిపెట్టకుడా వారం రోజుల పాటు బెదిరించి అత్యాచారం చేశారు. 
 
గత కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్న కుమార్తెను గమనించి తల్లిదండ్రులు ఆరా తీయగా, జరిగిన విషయాన్ని బోరున విలపిస్తూ చెప్పింది. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షణాలపై ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.