1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. ICMR Says 'No Fourth Wave Of Coronavirus In India

కరోనా ఫోర్త్ వేవ్‌పై భయాలు అక్కర్లేదు.. ఐసీఎంఆర్

corona
కరోనా ఫోర్త్ వేవ్‌పై భయాలు అక్కర్లేదని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) స్పందించింది. కేవలం కొన్ని జిల్లాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న విషయాన్ని ఇటీవలి డేటా వెల్లడిస్తోందని ఐసీఎంఆర్ తెలిపింది. దీన్ని ఫోర్త్ వేవ్ గా భావించలేమని, కొన్నిచోట్ల స్థానికంగా కేసులు ఎక్కువ వస్తున్నాయని వివరణ ఇచ్చింది.  
 
ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సమీరన్ పాండా మాట్లాడుతూ, ఆయా ప్రాంతాల్లో జనాభాకు అనుగుణంగా కరోనా టెస్టులు చేయడంలేదని అన్నారు. 
 
తక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేసినప్పుడు వచ్చే పాజటివ్ కేసుల సంఖ్య ఆధారంగా ఆ ప్రాంతంలో కరోనా అధికంగా ఉందని చెప్పలేమని తెలిపారు.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
గగనతలంలో విమానం కుదుపులు.. 17 మందికి గాయాలు