1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (10:36 IST)

కరోనా ఫ్రీగా ఏపీ - 24 గంటల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు

andhra pradesh
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. సోమవారం కరోనా ఫ్రీ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఏపీలో గత కొద్ది రోజులుగా సింగిల్ డిజిట్‌లో నమోదవుతున్న కరోనా కేసులు.. సోమవారం మాత్రం జీరో వచ్చాయి. ఈ నెల 20,21వ తేదీల్లో ఒక కేసు నమోదవ్వగా.. 22న నాలుగు కేసులు, 23వ తేదీన రెండు కేసులు నమోదయ్యాయి. 
 
ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మరికొద్ది రోజులు ఇలానే జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా 2,163 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఒక్కటి కూడా పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో ప్రకటించింది. 12 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు.
 
ఇప్పటివరకు రాష్ట్రంలో 3,3519,781 శాంపిల్స్ పరీక్షించినట్లు చెప్పారు. మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే.. త్వరలో రాష్ట్రాన్ని కరోనా ఫ్రీ స్టేట్‌గా ప్రకటించవచ్చని అంటున్నారు.