సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (11:33 IST)

మహిళలపై నేరాలు.. మొదటి స్థానంలో ఏపీ..NCRB

woman
లైంగిక వేధింపులు, అత్యాచారాలు వంటి అకృత్యాలతో మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. మహిళలపై నేరాలు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు ఏపీలో పెరిగాయని ఎన్​సీఆర్​బీ తెలిపింది. ఈ తరహా ఘటనలపై 2019లో 1,892 కేసులు నమోదవగా... 2020లో 2,942 కేసులు రికార్డయ్యాయి.
 
2020లో దేశవ్యాప్తంగా జరిగిన ఈ తరహా ఘటనల్లో 33.14 శాతం మన రాష్ట్రంలోనే నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని జాతీయ నేరాల గణాంకల నివేదిక తెలిపింది. స్త్రీలపై జరిగిన మొత్తం నేరాల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నా... భౌతిక దాడులు తగ్గకపోవడం కలవరపరుస్తోంది.
 
ఈ తరహా ఘటనలకు సంబంధించి 2019లో 1,892 కేసులు నమోదు కాగా.... 2020లో ఆ సంఖ్య 2,942 కు పెరిగింది. ఏడాది వ్యవధిలో ఈ తరహా ఘటనలు 23.78 శాతం మేర అధికమయ్యాయి. 
 
2019లో దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల్లో 4.87 శాతం ఏపీలోనే ఉండగా.... 2020లో 4.59 శాతంగా ఉంది. ఇంకా స్త్రీలను రహస్యంగా చిత్రీకరించిన ఘటనలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల జాబితాలో ఏపీది రెండో స్థానమని నివేదిక తెలిపింది. 
 
అలాగే పని ప్రదేశాల్లో మహిళల్ని లైంగికంగా వేధించిన ఘటనల్లో 72 కేసులతో హిమాచల్ ప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలోనూ, 70 కేసులతో ఏపీ రెండో స్థానంలోనూ ఉన్నట్లు ఎన్​సీఆర్​బీ నివేదిక చెబుతోంది. 
 
అత్యధికంగా మహారాష్ట్రలో ఈ తరహా కేసులు 201 నమోదు కాగా, ఏపీలో 124 కేసులు ఉన్నాయి. మహిళలను వేధించిన ఘటనల్లో మహారాష్ట్రలో 2వేల 13, తెలంగాణలో 14వందల 38 తర్వాత... 956 కేసులతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని ఎన్​సీఆర్​బీ వెల్లడించింది.