1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (10:12 IST)

వివాహితకు లైంగిక వేధింపులు - తెరాస నేతకు దేహశుద్ధి

trsflag
ఓ మహిళను లైంగికంగా వేదించిన కేసులో తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెరాస పార్టీకి చెందిన నేతను కొందరు మహిళలు పట్టుకుని చితకబాదారు. ఈఘటన జగిత్యాలజిల్లా కోరుట్లలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... కల్లూరు గ్రామానికి చెందిన తెరాస గ్రామఖ అధ్యక్షుడు ఆకుల గంగాధర్ గౌడ్ తనను లైంగికవాంఛ తీర్చాలంటూ వేధిస్తున్నాడని ఓ మహిల తన భర్త దృష్టికి తెలిపింది. పైగా, తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
అయితే, ఆమె చెప్పింది విని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన గ్రామ మహిళలంతా కలిసి గంగాధర్ గౌడ్ ఇంటికి వెళ్లి పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.