1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Yanamala Ramakrishnudu slams on YS Jagan

ఏపీ సీఎం జగన్‌కు భవిష్యత్‌ తెలుస్తుంది : యనమల రామకృష్ణుడు

yanamala
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ కళ్లముందు తెలుస్తుందని, అందుకే సెంటిమెంట్ ప్రచారానికి తీశారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే నవ్యాంధ్రను రుణాంధ్రప్రదేశ్‌గా మార్చేశారన్నారు. ఇప్పటికే రూ.7.76 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి నెట్టేశారన్నారు. అందువల్ల సీఎం జగన్ మరోమారు బహిరంగ మార్కెట్‌, కార్పొరేషన్లలై రుణాలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయాలని ఆయన కోరారు. 
 
అంతేకాకుండా, సీఎం జగన్‌కు వైకాపా మరోమారు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఇపుడే అర్థమైపోయి, భవిష్యత్ కళ్లముందు కనిపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని తుంగలో తొక్కి తన గురించి, తన పార్టీ గురించే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారంటూ యనమల మండిపడ్డారు. 
 
అవినీతి సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలని జగన్ చూస్తున్నారని అన్నారు. ఏపీలో ఆదాయం లేకపోయినా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని యనమల అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ సమస్యల్లోకి నెట్టేస్తున్న వైకాపా నేతలు తమ తప్పులను ఎత్తిచూపితే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
'ఛలో సీఎంవో'కు అనుమతి లేదు... ఎవరూ రావొద్దు : సీపీ టాటా