గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (16:52 IST)

విజయవాడ అత్యాచార బాధితురాలికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నప్పటికీ ఏమాత్రం ఉపేక్షించరాదని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే, ఈ ఘటనకు బాధ్యులుగా భావించిన ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్ష్ వేటు కూడా వేశారు. ఈ సస్పండ్ అయిన వారిలో సీఐ హనీష్, ఎస్.ఐ శ్రీనివాసరావులు ఉన్నారు 
 
యువతి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోగా, తల్లిదండ్రులు ఫిర్యాదు పట్ల పోలీసులు నిర్లక్ష్యంతో వ్యవహరించారు. తక్షణం విచారణ జరుపకుండా తాస్కారం చేశారు. చివరకు బాధితురాలిని తల్లిదండ్రులే ప్రభుత్వ ఆస్పత్రి వద్ద గుర్తించారు. ఇది పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. దీంతో పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.