ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (14:58 IST)

మే నెలలో దావోస్‌కు వెళుతున్న ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే నెలలో దోవోస్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌‌లో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానం రావడంతో దావోస్‌కు వెళ్లాలని నిర్ణయించారు. 
 
నిజానికి ఈ సదస్సు గత యేడాది డిసెంబరు నెలలోనే జరగాల్సివుంది. కానీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సదస్సును వాయిదా వేశారు. గత రెండేళ్లుగా ఈ ఫోరంకు సంబంధించిన సమావేశాలు వర్చువల్ విధానంలోనే జరుగుతున్నాయి. ఈ దఫా మాత్రం భౌతికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో మే నెలలో ఆయన దావోస్‌కు వెళ్లి ఈ సదస్సులో పాల్గొంటారు.