గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

23న ఉమ్మడి పగో జిల్లాలో జనసేనాని పర్యటన

pawan kalyan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా పేరుతో ఓ యాత్రను కొనసాగిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన ఇప్పటికే అనంతపురం జిల్లాలో పర్యటించి పలువురు కౌలు రైతు కుటుంబాలకు తన వ్యక్తిగత నిధులతో ఆర్థిక సాయం చేశారు. ఇపుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీన ఆయన ఈ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. 
 
ఈ యాత్రలో భాగంగా, ఆయన 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఏలూరు బైపాస్ మీదుగా చింతలపూడికి వెళతారు. అక్కడ ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలను కలిసి జనసేన పార్టీ తరపున రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. 
 
ఆపై చింతలపూడిలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆత్మహత్యలకు పాల్పడిన మరికొందరు రైతులకు ఆయన లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేస్తారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది.