గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (09:55 IST)

తాడేపల్లి ప్యాలెస్‌లో కుమారమంగళం బిర్లాకు సీఎం జగన్ విందు

birla - jagan
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన కుమారమంగళం బిర్లాకు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రత్యేక విందు ఇచ్చారు. 
 
తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో బిర్లా గ్రూపు ఆధ్వర్యంలోని గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసిన కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంభం తర్వాత జగన్‌తో కలిసి కుమారమంగళం బిర్లా తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చారు. 
 
ఈ సందర్భంగా కుమారమంగళంను తన నివాసంలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్.. ఆయనకు ప్రత్యేక విందు భోజన వడ్డించారు. ఆ తర్వాత ఓ జ్ఞాపికను కూడా బిర్లాకు సీఎం జగన్ అందజేశారు. ఈ విషయాన్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.