సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (20:04 IST)

కడపలో ల్యాప్ టాప్ పేలిన ఘటన.. టెక్కీ మృతి

laptop
కోవిడ్ కారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కరోనా తగ్గిన సాఫ్ట్ వేర్ కంపెనీలు మాత్రం ఇంకా వర్క్ ఫ్రమ్ హోం కొనసాగిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో కడప జిల్లాలో ల్యాప్ టాప్ పేలి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందింది.
 
వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల క్రితం ల్యాప్ టాప్‌పై పనిచేస్తుండగా ఛార్జింగ్ నాణ్యత కొరవడింది కావడంతో ల్యాప్ టాప్ పేలిపోయింది. 
 
ఈ ఘటన సుమలత అనే టెక్కీ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 
 
ఈ క్రమంలో గాయపడిన మేకవారిపల్లెకు చెందిన 24ఏళ్ల సుమలత మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.