గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (11:38 IST)

రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాకాణి

kakani
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రిగా కాకాణి గోవర్థన్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ అవకాశం కల్పించే తొలి ఫైలుపై సంతకం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,395 కోట్లను ఖర్చు చేయనున్నారు. అలాగే, వైఎస్ఆర్ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైలుపై కాకాణి గోవర్థన్ రెడ్డి రెండో సంతకం చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, గన్నవరంలో రాష్ట్ర విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల అవసరాలు తీర్చేలా పీఏసీ ఖాతాలను అనుసంధానం చేస్తామని వెల్లడించారు. 
 
అంతేకాకుండా, రైతుల నగదు లావాదేవీలు కూడా ఆర్బీకేలలో జరిగేలా చర్యలు చేపడుతామన్నారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయ శాఖామంత్రిగా పని చేస్తానని చెప్పారు. మంత్రిగా తనకు అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వేల కోట్లకు పైగా రైతుల భరోసా నగదు బదిలీ చేశామని తెలిపారు.