గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (07:07 IST)

మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటున్న కేటీఆర్!

ktr
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే, తాను వెల్లడించిన అంకెలు తప్పని భారతీయ జనతా పార్టీ నేతలు నిరూపించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి అధిక మొత్తంలో నిధులు వెళుతున్నాయన్నారు. కానీ, తెలంగాణాకు కేంద్రం ఇచ్చే నిధులు మాత్రం అరకొరగా ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయంలో తాను చెప్పింది తప్పని తేలితో తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 
 
కేంద్రానికి తెలంగాణ ఇప్పటివరకు రూ.3,65,797 కోట్లు ఇస్తే, అదే సమయంలో కేంద్రం నుంచి తెలంగాణాకు వచ్చింది రూ.1,68,674 కోట్లు మాత్రమేనని వివరించారు. ఈ మాట తప్పయితే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన మాటను తప్పుగా నిరూపిస్తే ఎడమకాలికి చెప్పులా ఉన్న మంత్రి పదివిని వదిలివేస్తానని తెలిపారు. 
 
మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశాక సాధార‌ణ ఎమ్మెల్యేగానే తాను కొన‌సాగుతాన‌ని కేటీఆర్ అన్నారు. ద‌మ్ముంటే బీజేపీ నేత‌లు త‌న వ్యాఖ్య‌లు త‌ప్ప‌ని నిరూపించాల‌ని ఆయ‌న బీజేపీకి స‌వాల్ విసిరారు. తెలంగాణ నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌లుగురు బీజేపీ ఎంపీలు ఏనాడైనా ప్ర‌ధానిని క‌లిశారా? అని కూడా కేటీఆర్ ప్ర‌శ్నించారు.