మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (14:10 IST)

కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన.. షెడ్యూల్ వివరాలు ఇవే

ktramarao
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 16న కేటీఆర్ పర్యటన వుంటుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధ్రువీకరించారు. 
 
ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో పలు అభవృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, పువ్వాడ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 
 
షెడ్యూల్ వివరాలు
16న ఉదయం 9.00 హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి 10.00గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 
10.15 గంటలకు రఘునాథపాలెం పల్లె బృహత్ ప్రకృతి వనం పార్క్ ప్రారంభిస్తారు. 
10.45 గంటలకు ఖమ్మం టేకులపల్లి కేసీఆర్ టవర్స్ వద్ద డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభిస్తారు.
 
అలాగే,  ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన ఫుట్ పాత్‌ను ప్రారంభిస్తారు. ఆపై మున్సిపల్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం బహిరంగ సభకు అనంతరం హైదరాబాదుకు తిరుగు ప్రయాణం అవుతారు.