ఎంఐఎం కార్పోరేటర్‌పై కేటీఆర్ ఫైర్.. ఇలా చేస్తే సహించేది లేదు
Police
పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో ఇలాంటి వాటిని సహించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తులకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నా వారిని వదలకూడదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
కాగా.. బోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్.. తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. తాను ఈ ఏరియాకు రావద్దని చెప్పినా.. మళ్లీ ఎందుకు వస్తున్నారంటూ.. పోలీసులకు బెదిరించాడు.
అయితే.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కేటీఆర్ కార్పొరేటర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
*తెలంగాణ పోలీసులకు ధమ్కీలు !*
*నిస్సహాయ స్థితిలో పోలీసు సిబ్బంది*
*పోలీసు శాఖ కు సవాలు విసురుతున్న వ్యక్తి*
*నా ఇలాకాలో పోలీసులు అడుగు పెట్టొద్దని హుకుం జారీ !*
*పోలీసులు వంద రూపాయల మనుషులే అంటూ తెలంగాణ పోలీసు శాఖ ను అవహేళన !*
ఇది మన కాస్మోపాలిటన్ హైదరాబాద్‌లో పరిస్థితి
తర్వాతి కథనం
