బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (12:02 IST)

సీఎం జగన్ అదుర్స్.. కాన్వాయ్‌ని ఆపి ఆంబులెన్స్‌కు దారిచ్చారు..

ys jagan
సీఎం కాన్వాయ్ వచ్చినా ప్రజల అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కాన్వాయ్‌ని ఆపి ఆంబులెన్స్‌కు దారిచ్చిన ఘటన తాడేపల్లిలో చోటుచేసుకుంది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం జగన్‌ తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. 
 
సరిగ్గా సీఎం కాన్వాయ్‌ గన్నవరం వద్ద జాతీయ రహదారి నుంచి విమానాశ్రయంలోకి ప్రవేశించే సమయానికి విజయవాడ వైపు వెళ్తున్న 108 అంబులెన్స్‌ అక్కడికి చేరుకుంది. 
 
దీంతో ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తమై సీఎం కాన్వాయ్‌ మధ్యలో నుంచి అంబులెన్స్‌ను ముందుకు పంపించారు. అనంతరం సీఎం కాన్వాయ్‌ ఎయిర్‌పోర్టులోకి చేరుకుంది.