బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (11:56 IST)

సీఎం జగన్ మహిళా ద్రోహి... వంగలపూడి అనిత

ఏపీ సీఎం జగన్‌ మహిళా ద్రోహి అని చెప్పడానికి పలు ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయన్నారు  రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. వైకాపా నాయకులు వరుసగా మహిళలపై అకృత్యాలకు పాల్పడుతుంటే సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు. 
 
గుంటూరు జిల్లాలో మైనర్‌ బాలికపై అత్యాచార ఘటనలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు, ఆఫ్కాఫ్‌ ఛైర్మన్‌ కొండూరు అనిల్‌బాబు హస్తం ఉందని ఆరోపించారు. ఈ ఘటనలో ఓ ఎంపీ అనుచరుడు భూశంకరనాయుడు పేరు మొదటగా వచ్చిందన్నారు. 
 
అనిల్‌బాబును అరెస్టు చేస్తే మరికొందరు నేతల పేర్లు బయటపడతాయన్నారు. రాష్ట్ర హైకోర్టు ఈ కేసును సుమోటాగా తీసుకొని విచారణ చేపట్టాలన్నారు.