బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (20:22 IST)

శ‌ర‌వేగంగా షూటింగ్‌లోఎస్‌.వి.కృష్ణారెడ్డి చిత్రం ఆర్గానిక్ మామ‌- హైబ్రీడ్ అల్లుడు

SV Krishnareddy, Sohail, Mrinalini Ravi, Kalpana, Krishna Bhagwan, Achireddy,
SV Krishnareddy, Sohail, Mrinalini Ravi, Kalpana, Krishna Bhagwan, Achireddy,
సోహైల్‌, మృణాళిని ర‌వి జంట‌గా డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, మీనా, అలీ, సునీల్ త‌దిత‌ర తారాగ‌ణంతో రూపొందుతోన్న చిత్రం ఆర్గానిక్ మామ‌- హైబ్రీడ్ అల్లుడు. క‌ల్ప‌న చిత్ర బేన‌ర్‌పై క‌ల్ప‌న కోనేరు నిర్మిస్తున్నారు. ఎస్‌.వి.కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బుధ‌వారంనాడు ఈ చిత్రం షూటింగ్ బేగంపేట్‌లోని మ‌నోహ‌ర్ హోట‌ల్‌లో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా ఎస్‌.వి. కృష్ణారెడ్డి జ‌న్మ‌దిన‌ వేడుక చిత్ర యూనిట్ స‌మ‌క్షంలో ఆహ్లాద‌ర‌కంగా జ‌రిగింది. 
 
అనంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో అచ్చిరెడ్డి మాట్లాడుతూ, జ‌ర్న‌లిస్టు మిత్రులు, చిత్ర యూనిట్ స‌మ‌క్షంలో ఎస్‌.వి. కృష్ణారెడ్డి జ‌న్మ‌దిన వేడుక జ‌ర‌గ‌డం ఆనందంగా వుంది. ప్ర‌తి ఏడాది వ‌చ్చేది. ఆత్మీయుల స‌మక్షంలో జ‌రుపుకోవ‌డంలో ఆనందం వేరుగా వుంటుంది. ఈ చిత్ర క‌థ న‌చ్చి ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారు సినిమా తీయ‌డానికి కార‌ణ‌మైంది. అందుకు క‌ల్ప‌న‌గారు ఎంతో ప్రోత్స‌హించారు. సినిమా చేస్తుండ‌గానే అంద‌రికీ ప్రేమ పెరిగింది. సోహైల్ హీరోగా బాగా చేస్తున్నాడు. మృణాళిని మంచి న‌టి. చాలా నాచుర‌ల్‌గా చేస్తుంది. తెలుగులో సుస్థిర స్థానం సంపాదించుకుంటుంద‌నే న‌మ్మ‌క‌ముంది అన్నారు. 
 
SV Krishnareddy,  C. kalyan, Achireddy,
SV Krishnareddy, C. kalyan, Achireddy,
ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్ మాట్లాడుతూ, ఎస్‌.వి. కృష్ణారెడ్డి పెద్ద బేన‌ర్‌లో చేశాడు. స‌క్సెస్ కొట్టాడు అనేలా ఈ సినిమా వుంటుంది. మొన్నీమ‌ధ్య అలీ క‌లిశాడు. 22 ఏళ్ళ క్రితం న‌న్ను హీరోగా ప‌రిచ‌యం చేసి స‌క్సెస్ చేశాడు. ఇప్పుడు సోహైల్‌తో ఎస్‌.వి. కృష్ణారెడ్డి సినిమా చేస్తుంటే ఆ వైబ్రేష‌న్స్ వ‌స్తున్నాయి. సినిమాలు ఎన్ని చేసినా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఓహో అనిపించుకునేలా కాకుండా బాగుంది అంటే సూప‌ర్ హిట్‌. ఎస్‌.వి. కృష్ణారెడ్డి అలా క‌థ‌ను ఎన్నుకున్నారు. ఈ సినిమా ఆయ‌న‌కు గొప్ప మ‌లుపు కావాల‌ని కోరుకుంటున్నాను. మీరంద‌రికీ తెలీని ఓ విష‌యం చెబుతా. హీరోగా ఎస్‌.వి. కృష్ణారెడ్డి ప‌రిచ‌యం అయిన‌ప్పుడు ఆయ‌న పేరు క‌ళ్యాణ్‌. నా పేరు క‌ళ్యాణ్‌. అందుకే ముందుగా సి.క‌ళ్యాణ్ అనే పేరు పెట్టుకున్నాను. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు అయ్యాక ఎస్‌.వి. కృష్ణారెడ్డి పేరును య‌థాత‌థంగా వుంచుకున్నారు. ఆయ‌న‌తో 38 ఏళ్ళ జ‌ర్నీ, మా జ‌ర్నీ సూప‌ర్ హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది అన్నారు.
 
ఎస్‌.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మ‌నిషికి అదృష్టం వ‌రించాలి. అది నిజం. నాకు అచ్చిరెడ్డిగారి లాంటి వ్య‌క్తిని దేవుడు ఇచ్చాడు. న‌న్ను దిశానిర్దేశం చేసింది ఆయ‌నే. ఆనాడు, ఈనాడు, ఏనాడు కూడా ప్ర‌తిక్ష‌ణం నా భ‌విష్య‌త్ గురించే ఆలోచిస్తారు. ఐదేళ్ళ నుంచి ఐదు క‌థ‌లు రాసుకున్నాను. అలా రాయ‌డానికి కార‌ణం అచ్చిరెడ్డిగారే. ప్ర‌తి డైలాగ్ ఆయ‌న‌కు వినిపించేవాడిని. కొత్త కొత్త ప‌దాలు పుడుతున్నాయ్ అనేవారు.


ఇక నిర్మాత‌గా ఎవ‌రు అని ఆలోచిస్తుండ‌గా, దేవుడు అదృష్టం రూపంలో క‌ల్ప‌న గారి రూపంలో పంపాడు. ఆమె మంచి నిర్మాత‌. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మాణం చేస్తున్నారు. అందుకు త‌గిన న‌టీన‌టులును అందించేవారు. నా క‌థ‌ను విని నాన్‌స్టాప్‌గా ఆమె న‌వ్వారు. రేపు ప్రేక్ష‌కులు కూడా అదే ఫీల‌వుతారు. వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్ట‌డానికి నేను నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతూనే వుంటాను. అది నా నైజం. నేను క‌మిట్‌మెంట్‌తోనే సినిమా తీస్తాను. ఆడవారిని కించ‌ప‌రిచేవిధంగా అస్స‌లు తీయ‌ను. కొంద‌రు వ‌చ్చి న‌న్ను ఆ మార్గంలో చేయ‌మ‌న్నారు. వ‌ద్ద‌ని అచ్చిరెడ్డిగారు చెప్పారు. మ‌న శైలిలో వెళితే ఎప్పుడో ఒక‌ప్పుడు మార్గం దొరుకుతుంది అన్నారు. ఆయ‌న నాకు దేవుడిచ్చిన వ‌రంగా భావిస్తున్నా.

 
క‌థ రాసుకున్నాక అద్భ‌తం అన్నారు. మాట‌లు బాగున్నాయ‌న్నారు. సంగీతం చేశాను. క‌సితో మంచి సినిమా ఇవ్వాల‌నే త‌పిస్తున్నాను. న‌న్ను నేను ద‌ర్శ‌కుడిగా నిల‌బ‌డ‌డానికి ఎంత శ్ర‌మ చేశానే ఇప్పుడు అదే త‌ప‌న‌తో చేస్తున్నాను. 40 సినిమాలు చేసిన అనుభ‌వం. ఇంగ్లీషులోనూ సినిమా చేశాను. యు.ఎస్‌. డైరెక్ట‌ర్ అసోసియేష‌న్‌లో నేను మెంబ‌ర్‌ను. అందుకే మీకోసం మిమ్మ‌ల్ని న‌వ్వించ‌డానికి సినిమా చేశాను. అందుకు హీరోగా సొహైల్‌ను ఎంచుకున్నాను. కామెడీ, సెంటిమెంట్‌, ఫైట్స్‌, డాన్స్ బాగా చేస్తున్నాడు. క‌మ‌ర్షియ‌ల్ హీరో ల‌క్ష‌ణాలున్నాయి. మృణాళిని ర‌వి మంచి న‌టి. సున్నిత‌మైన భావాల‌న్ని బాగా ప‌లికిస్తుంది. ఇంత‌మందిని అందంగా చూపించ‌డానికి రామ్ ప్ర‌సాద్ సిద్దంగా వున్నాడు. కెమెరామెన్ రామ్ ప్ర‌సాద్‌తో 18 ఏళ్ళ‌నాడు పెళ్లాం ఊరెళితే చేశాం. రెండున్న‌ర కోట్ల ఖ‌ర్చు. 18 కోట్ల రాబ‌డి. అదే సినిమా హిందీలో తీశారు. ప్ర‌తి సినిమాను బాగా మ‌ల‌చాల‌నే త‌ప‌న ఆయ‌నలో వుంది అన్నారు.

 
సోహైల్ మాట్లాడుతూ, ఈ సినిమాలో నా టాలెంట్‌ను ద‌ర్శ‌కుడు బ‌య‌ట‌పెడుతున్నారు. చిన్న సీన్ కూడా చేసి మ‌రీ చూపిస్తున్నారు. అలా కొంత‌మంది ద‌ర్శ‌కులే వుంటారు. ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారికి థ్యాంక్స్‌. రామ్ ప్ర‌సాద్‌గారి కెమెరా ప‌నితం బాగుంది. సూప‌ర్ డూప‌ర్ మూవీలో చేస్తున్నా. లైఫ్‌లో ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది. నిర్మాత క‌ల్ప‌న‌గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఎంట‌ర్‌టైన్ మెంట్ ఇవ్వాల‌నే క‌సితోనే అంద‌రం చేస్తున్నాం. అచ్చిరెడ్డిగారు లొకేష‌న్‌కు వ‌స్తే పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది.  మృణాళిని నేచుర‌ల్‌ న‌టి. ఆమె ఎంట‌ర్ కాగానే నాకు కాంపిటేష‌న్ వ‌చ్చింద‌నే ఫీల్ క‌లిగింది అని చెప్పారు. 
 
మృణాళిని ర‌వి మాట్లాడుతూ, ఈ సినిమా నాకు రావ‌డం ల‌క్కీగా భావిస్తున్నా. లెజండ‌రీ ద‌ర్శ‌కుడుతో ప‌నిచేస్తున్నందుకు ఆనందంగా వుంది. సెట్లో చాలా కూల్‌గా వుంటారు. చిన్న‌చిన్న మూవ్‌మెంట్స్ బాగా డీల్ చేస్తారు. ఆయ‌న‌లో గొప్ప న‌టుడు వున్నారు. నిర్మాత క‌ల్ప‌న‌గారు కుటుంబ‌స‌భ్యులా చూస్తున్నారు. అంద‌రూ మంచి ఎన‌ర్జీతో ప‌నిచేస్తున్నార‌ని అన్నారు.  

 
నిర్మాత క‌ల్ప‌న మాట్లాడుతూ, మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా చేయ‌డం చాలా ఆనందంగా వుంది. సెట్లో వున్న ప్ర‌తివారూ త‌ల్లిగా భావించి నేను తిట్టినా భ‌రిస్తున్నారు. అంద‌రూ మంచి స‌హ‌కారం అందిస్తున్నార‌ని తెలిపారు. కృష్ణ భ‌గ‌వాన్ మాట్లాడుతూ, ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. ఆయ‌న పీక్ స్టేజీలోనే ప‌లు విజ‌య‌వంత‌మైన ద‌ర్శ‌కుడిగా పేరు పొందారు. అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడు. మ‌రెన్నో పుట్టిన‌రోజులు ద‌ర్శ‌కుడిగానే జ‌రుపుకోవాల‌ని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో నేను కూడా భాగ‌మైనందుకు ఆనందంగా వుంది. సోహైల్‌ను బిగ్‌బాస్ షోలో చూడ‌గానే హీరో అవుతాడ‌నే అనుమానం క‌లిగింది. నిజంగా అయ్యాడు. ఈ క‌థ హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది. నిర్మాత క‌ల్ప‌న‌గారు మంచి అభిరుచి గ‌ల నిర్మాత‌. మ‌రిన్ని సినిమాలు తీయాల‌ని కోరుకుంటున్నాను అని చెప్పారు.

 
కెమెరా మెన్ రామ్ ప్ర‌సాద్ మాట్లాడుతూ, నాపై న‌మ్మ‌కంతో ఈ సినిమా ఇచ్చారు. మీ అంద‌రి స‌పోర్ట్ వ‌ల్లే బాగా చేస్తున్నాను. మంచి హిట్ ఇస్తామ‌నే న‌మ్మ‌కం పూర్తిగా వుంది అని అన్నారు. న‌టీన‌టులుః సోహైల్‌, మృణాళిని ర‌వి, డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, మీనా, అలీ, సునీల్, అజ‌య్ ఘోష్‌, హేమ‌, ప్ర‌వీన్‌, స‌ప్త‌గిరి త‌దిత‌రులు, సాంకేతిక‌త‌త‌- నిర్మాతః క‌ల్ప‌న కోనేరు, క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, సంగీతం, ద‌ర్శ‌క‌త్వంః ఎస్‌.కృష్ణారెడ్డి, డైరెక్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ- సి. రాంప్ర‌సాద్‌, పాట‌లు- చంద్ర‌బోస్‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, ర‌వికుమార్‌, పి.ఆర్‌.ఓ- సురేష్ కొండేటి.