సత్యదేవ్, తమన్నా భాటియా గుర్తుందా శీతాకాలం తేదీ ఖరారు
Satyadev and Tamannaah
ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రామారావు చింతపల్లి గారు వరస సినిమాలతో ఇండస్ట్రీలో తన మార్క్ చూపించుకుంటున్నారు. క్రేజీ ప్రాజెక్టులను ఆయన నిర్మిస్తూ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్‌గా మారుతున్నారు. గుర్తుందా శీతాకాలం నిర్మాణంలో ఈయన భాగస్వామ్యం చాలా ఉంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టాలెంటెడ్ హీరో సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి బాగా పెరిగిపోయింది. ఇండస్ట్రీలో వర్గాల్లోనూ ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన లవ్ మాక్‌టైల్ ఆధారంగా గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో సత్యదేవ్, తమన్నా కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్. ఈ పాట అభిమానులకే కాదు అందరికీ బాగా నచ్చేస్తుంది. సినిమాను సెప్టెంబర్ 23న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.
నటీనటులు: సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి తదితరులు
టెక్నికల్ టీం: స్కీన్ ప్లే, డైరెక్షన్ - నాగశేఖర్, సమర్పకులు - ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు
నిర్మాతలు - భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి
పబ్లిసిటీ డిజైనర్స్ - అనిల్, భాను
కొరియోగ్రఫి - వీజేశేఖర్
లైన్ ప్రొడ్యూసర్స్ - సంపత్, శివ ఎస్. యశోధర
ఎక్సీక్యూటివ్ ప్రొడ్యూసర్ - నవీన్ రెడ్డి
డైలాగ్స్ - లక్ష్మీ భూపాల్
మ్యూజిక్ - కాలభైరవ
ఎడిటిర్ - కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రాఫర్ - సత్య హెగ్డే
స్టంట్స్ - వెంకట్
PRO - ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
