గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (20:40 IST)

తులసి పూజ చేస్తే ఏంటి ఫలితం.. వేలి గోర్లు తగలకుండా..? (video)

తులసి మొక్కలో నిల్వ ఉండే నీరు పుణ్య తీర్థంతో సమానం. మంగళ, శుక్రవారాల్లో తులసి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. వివాహ ఆటంకాలు పోవాలంటే కన్యలు తులసి పూజ చేస్తే త్వరలో మాంగల్య దోషం తొలగి వైవాహిక జీవితం బాగుంటుంది. 
 
తులసి తీర్థం ఉంచిన పంచ పాత్రలో కొద్దిగా పచ్చ కర్పూరం, తులసిని వేయాలి. అలాగే తమలపాకులు, పువ్వు, పండు, కొబ్బరికాయలతో  పూజ చేయాలి. పూజ కోసం తులసిని తీసుకునేటప్పుడు వేలి గోర్లు తగలకుండా చూసుకోవాలి. 
 
కృష్ణ తులసితో దేవతలకు అర్పించవచ్చు. కానీ గణేశుడికి, శక్తి దేవికి, శివునికి సమర్పించాడు. తెలుపు కృష్ణతులసిని రాముడికి, హనుమంతుడికి సమర్పించవచ్చు. 
 
తులసిని పెంచడం, పూజించడం వల్ల ఆయురారోగ్యాలు, కీర్తి, సంపద, సంతానోత్పత్తి కలుగుతాయి. తులసీ పూజతో బ్రహ్మహత్యా దోషం తొలగిపోతుంది. పాపాలు కూడా నశిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.