శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 నవంబరు 2022 (14:18 IST)

మాజీ మంత్రి కొడాలి నానికి కిడ్నీ ఆపరేషన్...!!

kodali nani
ఏపీకి చెందిన మాజీ మంత్రి, వైకాపా నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి కిడ్నీ ఆపరేషన్ జరిగింది. శుక్రవారం రాత్రి ఈ శస్త్రచికిత్స జరిగింది. హైదరాబాద్ నగరంలోని అపోలో ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. 
 
నిజానికి ఆయన గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇది తీవ్రతరం కావడంతో మూడు రోజుల క్రితమే ఆయన హైదరాబాద్ నగరంలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. శుక్రవారం రాత్రి కిడ్నీ ఆపరేషన్ చేశారు. 
 
ఈయన మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన రెండు వారాల పాటు పూర్తిగా విస్రాంతి తీసుకోవాలని వైద్యులు మాజీ మంత్రి కొడాలి నానికి సూచించినట్టు తెలిపారు. 
 
ఆ తర్వాత ఆయనకు మరోమారు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో అంతా బాగన్నట్టు తేలితే 15 రోజుల తర్వాత కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్స చేసే అవకాశాలు ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.