కొడాలి నాని కమ్మవర్గంలో పుట్టిన దరిద్రుడు : గోరంట్ల బుచ్చయ్య
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గట్టి వార్నింగ్ ఇచ్చారు. "జగన్మోహన్ రెడ్డి.. నీ తాత దిగొచ్చినా అమరావతిని ఆపలేడు. నవ్యాంధ్రకు అమరావతే రాజధాని. ఒక్క రాజధానికే దిక్కులేదు. నీవు మూడు రాజధానులు కడతావా! నీ ఫ్యాక్షన్ రాజకీ యాలకు నీవే బలైపోతావు" అంటూ హెచ్చరించారు.
ఇదే అంశంపై ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి జగనన్ను సాగనంపడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారన్నారు. 'అమరావతి కోసం త్యాగం చేసిన రైతులు అరసవల్లి సూర్య భగవానుడి ఆశీస్సులు తీసుకోవడానికి పాదయాత్ర చేస్తానంటే, అనుమతి లేదంటావా? ప్రజలే స్వాగతిస్తారని ఆయన స్పష్టం చేశారు.
"కొడాలి నాని కమ్మవర్గంలో పుట్టిన దరిద్రుడు. వెధవ. స్పీకర్ ఆ స్థానానికే మచ్చ. ఖబడ్డార్ అని ఆయన హెచ్చరించారు. అమరావతిని చంపేయాలని చూస్తున్నారు. సాగ నీయం. అవసరమైతే జైలుభరో కార్యక్రమానికి పిలుపు ఇచ్చి, జైళ్లనే నింపేస్తామని ఆయన హెచ్చరించారు.