బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (14:22 IST)

నారా లోకేశ్ జూమ్‌ మీటింగ్: కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎలా వచ్చారు?

nara lokesh
టీడీపీ నేత నారా లోకేశ్ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులతో జూమ్‌లో స‌మావేశం నిర్వ‌హిస్తుండ‌గా ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. లోకేశ్ నిర్వ‌హిస్తోన్న ఆ స‌మావేశంలో ఉన్న‌ట్టుండి ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క‌న‌ప‌డ్డారు. 
 
విద్యార్థుల‌ పేరుతో వైసీపీ నేతలు జూమ్ స‌మావేశంలో ఎంట్రీ ఇవ్వ‌డంతో లోకేశ్ ఫైర్ అయ్యారు. ఇలా జూమ్ మీటింగ్‌‍లో ఎందుకొస్తారని ప్రశ్నించారు. అంతేగాకుండా తనతో చ‌ర్చించాలంటే నేరుగా రావాలంటూ లోకేశ్ సవాల్ విసిరారు. 
 
వైసీపీ నేతల బెదిరింపులకు భయపడేదేలేదని నారా లోకేష్ చెప్పారు. జూమ్ స‌మావేశంలోకి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ రావ‌డంతో విద్యార్థులు కూడా షాకయ్యారు. చివ‌ర‌కు నారా లోకేశ్ హెచ్చ‌రించ‌డంతో కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ ఆ స‌మావేశం నుంచి లెఫ్ట్ అయ్యారు.