బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (17:51 IST)

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి ముందు జనసైనికుల ఆందోళన

kodali nani
గుడివాడలో రోడ్లు పూర్తిగా పాడయ్యాయని, వాటిని మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తూ జనసేన శ్రేణులు గుడివాడ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించాయి.

సీఎం జగన్ వాస్తవాలను గుర్తించాలని నినాదించారు. రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. 
 
ఈ సందర్భంగా పోలీసులకు, జనసేన శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని... తమని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. 
 
కొడాలి నాని ఇంటికి వెళ్లే దారి కూడా గోతులమయంగా ఉందని.. మాజీ మంత్రి ఇంటికి వెళ్లే దారే ఇలా ఉంటే.. ఇతర దారుల పరిస్థితి ఏమిటని వారు మండిపడ్డారు.