గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 జులై 2022 (11:46 IST)

నేడు విజయవాడలో జనసేన పార్టీ జనవాణి

janasena
జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జనవాణి కార్యక్రమం జరుగనుంది. సామాన్యుడి ఘోషను వినేందుకు వీలుగా జనవాణి పేరుతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు. 
 
ఇదే విషయంపై ఆ పార్టీ పీఏసే ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, వైకాపా ప్రతినిధులు నిర్వహిస్తున్న గడప గడప కార్యక్రమం ఒట్టి బూటకమన్నారు. రాష్ట్రంలో ప్రజలు తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక అయోమయ పరిస్థితిలో ఉన్నారన్నారు. అందుకే, తమ పార్టీ అధ్వర్యంలో ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 
 
తొలి జనవాణి కార్యక్రమాన్ని మూడో తేదీన విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ఆ తర్వాత వాటిని సంబంధిత విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు పంపించి, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై జనసేన పార్టీ తరపున ఆరా తీస్తారని తెలిపారు. 
 
విజయవాడలో ఈ నెల 10న కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతామన్నారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఈ నెల 12 నంచి తమ కార్యకర్తలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తారని తెలిపారు.