సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (22:56 IST)

దంతాలను ఆరోగ్యంగా - పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే... (video)

teeth
సాధారణంగా అనేక మంది నోటి ఆరోగ్యంపై పెద్దగా దృష్టిసారించరు. ఫలితంగా దంతాలు పాచిపట్టి, పుచ్చిపోతుంటాయి. దీంతో భరించలేని పంటి నొప్పి వస్తుంది. ఈ సమస్య తలెత్తితేగానీ దంతాల ప్రాధాన్యత ఏంటో ఎవరికీ అర్థంకాదు. అందుకే దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని వైద్యులు కోరుతుంటారు. అయితే, దంతాలు పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
మనిషి బాహ్య సౌందర్యంపై దృష్టిపెట్టినంతగా, దంతాల ఆరోగ్యంపై చూపరు. కానీ, పంటి నొప్పి వచ్చిన తర్వాతే దీని ప్రాధాన్యత ఏంటో అర్థం కాదు. ఉదయం నిద్ర లేచాక పళ్లు తోముకోవడంలో చాలా మంది సరిపుచ్చుతుంటారు. నిజానికి రాత్రి పడుకోబోయే ముందు బ్రష్‌తో పళ్ళు తోముకోవడం తప్పనిసరి. ఆహార అలవాట్ల పరంగా జాగ్రత్తగా ఉండాలి కూడా. 
 
పళ్ళకు అంటుకునిపోయే పదార్థాలు ముఖ్యంగా, చాక్లెట్లు వంటివి ఆరగించినపుడు పళ్లను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఈ విషయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మరిచిపోవద్దు.
 
భోజనం చేసిన ప్రతిసారీ నోటిని నీటితో బాగా పుక్కిళించాలి. దీంతో పళ్ల మధ్యలో చిక్కుకున్న పదార్థాలు తొలగిపోతాయి. లేకపోతే బ్యాక్టీరియా పెరిగిపోయే ప్రమాదం ఉంది. 
 
నిమ్మ, ద్రాక్ష, పైనాపిల్, బత్తాయి, ఆరెంజ్ వంటి పుల్లటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అదేసమయంలో వీటిలో ఉండే ఆమ్లం దంతాలపై ఉండే ఎనామిల్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. 
 
ఇలాంటి పదార్థాలు పుల్లటి పదార్థాలను ఆరగించినపుడు ఖచ్చితంగా నీటితో పుక్కిళించాలి. దీంతో ఆమల్ం గాఢత తగ్గుతుంది. అలాగే వెంటనే పళఅలు తోముకోకూడదు. ఓ అరగంట తర్వాత పళ్లు తోముకోవాలి. 
 
చూయింగ్ గమ్ నిమిలితే ముఖ కండరాలకు వ్యాయామం కలుగుతుంది. రక్త ప్రసరణ కూడా జరుగుతుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అయితే, గమ్‌లోని చక్కెర పళ్లను దెబ్బతీస్తుంది. కాబట్టి చక్కరలేన గమ్‌ను నమలటం మంచిది. దీంతో నోట్లో లాలాజనం బాగా ఊరుతుంది. ఇది పళ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతుంది. 
 
అన్నిటికంటే ముఖ్యంగా, ఆరోగ్యానికి నీరు ఎంతో మేలు చేస్తుంది. ప్రాణానికి నీరే ఆధారం కూడా. తగినంత నీరు తాగితే ఆరోగ్యంతో పాటు దంతాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది.