గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2022 (08:19 IST)

పోస్టర్‌ ద్వారా పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

Ustad Bhagatsingh  poster
Ustad Bhagatsingh poster
పవన్‌ స్టార్‌ పవన్‌ కళ్యాన్‌ తాజా సినిమా భవదీయుడు భగత్‌ సింగ్‌ గురించి తెలిసిందే. ఆ టైటిల్‌తో పోస్టర్‌ను కూడా గతంలో విడుదల చేశారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. మైత్రీమూవీ మేకర్స్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే రెండు రోజులనాడు దర్శకుడు హరీష్‌ శంకర్‌, హరిహరవీరమల్లు సెట్లో పవన్‌ కళ్యాణ్‌ను కలవడంతోపాటు ఫొటోలు పోస్ట్‌ చేశారు. త్వరలో షూటింగ్‌ వుండబోతోందని వెల్లడించారు.
 
కాగా, ఈరోజు ఉదయమే పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ అంటూ పోస్టర్‌ ద్వారా అప్‌డేట్‌ ఇచ్చేశారు. మైత్రీమూవీ మేకర్స్‌ విడుదలచేసిన ఈ పోస్టర్‌లో వినోదం అంతకుమించి వుంటుందని తెలియజేస్తున్నారు. త్వరలో షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. బీ రెడీ ఫర్‌ అప్‌డేట్స్‌ అంటూ పోస్ట్‌ చేశారు. రెండురోజులనాడే హరీశ్‌ శంకర్‌ స్నేహితుడు తెలంగాణ మంత్రి అజయ్‌ కూడా మాట్లాడుతూ, గబ్బర్‌ సింగ్‌ తరహాలో మంచి సినిమా పవన్‌తో చేయండి. భగత్‌సింగ్‌ అలాంటిదే అయివుంటుందని ఇన్‌డైరెక్ట్‌గా హరీష్‌ వర్షన్‌ చెప్పాడు. సో. అభిమానులకు వినోదమే మరి. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.