గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (14:42 IST)

బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు అతిథిగా ప్రభాస్

Balaiah - prabhas
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో హీరో నందమూరి బాలకృష్ణ యాంకరింగ్ చేస్తూ నిర్వహిస్తున్న షో అన్‌స్టాపబుల్ షో. దీనికి అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి, వారి మనోగతాన్ని ఆవిష్కరిస్తున్నారు. దీంతో ఈ షోలా బాగా పాపులర్ అయింది. 
 
ఈ నేపథ్యంలో "బాహుబలి" చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ఈ షోకు రానున్నారు. ఆయన హీరో బాలకృష్ణతో కలిసి తొలిసారి వేదికను పంచుకోనున్నారు. పైగా, ప్రభాస్ ఇంలాటి షోలో పాల్గొనడం కూడా తెలుగులో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఎపిసోడ్ కోసం ఇటు అటు ఫ్యాన్స్, అటు నందమూరి అభిమానులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. 
 
ఈ ఎపిసోడ్ చిత్రీకరణ ఇటీవలే పూర్తి చేశారు. తన స్నేహితుడు, హీరో గోపీచంద్‌తో కలిసి ప్రభాస్ ఈ షోలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించి 43 సెకన్ల నిడివివున్న గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ప్రభాస్‌ను బాలయ్య ఆప్యాయంగా హత్తుకున్నారు. నవ్వుతూ హుషారుగా కనిపించారు.