గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (13:46 IST)

నన్ను నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాస్: ఎస్ ఎస్ రాజమౌళి

Prabhas, SS Rajamouli
Prabhas, SS Rajamouli
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డెైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి సినీ ప్రపంచానికి తెలుసు. ఛత్రపతి సినిమాతో వారి స్నేహం మొదలైంది. బాహుబలి రెండు భాగాల చిత్రాలతో ఈ ఇద్దరు మిత్రులు ప్రపంచస్థాయి విజయాన్ని అందుకున్నారు. ప్రతి సందర్భంలో ఒకరి కోసం మరొకరు అనేంత స్నేహ భావాన్ని చూపిస్తారు ప్రభాస్, రాజమౌళి. ఈ దిగ్ధర్శకుడు రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా విదేశాల్లో విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. ప్రేక్షకుల రివార్డులతో పాటు అవార్డులూ అందుకుంటోంది ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రీసెంట్ గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్, లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ పురస్కారాలు దక్కాయి. ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణికి శుభాకాంక్షలు తెలిపారు ప్రభాస్.
 
గ్రేటెస్ట్ రాజమౌళి గారు సినీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. బెస్ట్ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ తో పాటు, లాస్ ఏంజెలీస్ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ డెరెక్టర్ రన్నరప్ పురస్కారాలు అందుకున్నందుకు నా శుభాకాంక్షలు. అలాగే లాస్ ఏంజెలీస్ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డ్ గెల్చుకున్న కీరవాణి గారికి కంగ్రాట్స్ అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు. ప్రభాస్ విశెస్ కు స్పందించిన రాజమౌళి...థాంక్స్ డార్లింగ్. నేను ఇంత పేరు తెచ్చుకుంటానని నాకంటే ముందు నమ్మిన వ్యక్తి నువ్వు. అంటూ రిప్లై ఇచ్చారు.