శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (23:15 IST)

ఆర్ఆర్ఆర్.కు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుకు నామినేట్ అయినందుకు గర్వంగా ఉంది : ప్రభాస్

Rajamouli, Prabhas
Rajamouli, Prabhas
ఆర్ఆర్ఆర్.కు  గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులకు నామినేట్ అయినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను. ఈ ఘనత సాధించినందుకు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు మొత్తం టీమ్‌కి హృదయపూర్వక అభినందనలు." అని ప్రభాస్ ఇంస్ట్రాగామ్ లో తెలియజేసారు. 
 
global award
global award
ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును గెలుచుకున్నందుకు & ఉత్తమ దర్శకుడిగా (రన్నరప్) LA ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులను గెలుచుకున్నందుకు అభినందనలు. ఉత్తమ సంగీత దర్శకుడిగా LA ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ అందుకున్నందుకు లెజెండరీ కీరవాణి గారికి అభినందనలు తెలిపారు. ఇప్పటికే కొన్ని విదేశీ అవార్డ్స్ కొల్లగొట్టి ఇండియన్ సినిమా రేంజ్ ని ఎంతో పెంచిన ఆర్ఆర్ఆర్ కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి వచ్చి చేరిందనే చెప్పాలి.
 
ప్రపంచ ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాల క్యాటగిరి విభాగంలో బెస్ట్ పిక్చర్స్ గా మొత్తం ఐదు సినిమాలు నిలవగా అందులో ఆర్ఆర్ఆర్ కూడా ఒక నామినేషన్ ని, అలానే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నాటు నాటు సాంగ్ కూడా నామినేషన్ లిస్ట్ లో నిలిచింది.  మరి రాబోయే రాబోయే రోజుల్లో ఆర్ఆర్ఆర్ మూవీ ఇంకెన్ని సంచలన అవార్డులు అందుకుంటుందో చూడాలి.