1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Youths save tree from falling due to Cyclone Montha heavy wind

ఏం చెట్టురా అది, ఆ చెట్టు పడిపోకూడదు, బ్రతకాలి (video)

Youth save tree
మొంథా తుఫాన్ అపారంగా నష్టాన్ని సృష్టించింది. వేల ఎకరాల్లో పంట నష్టంతో పాటు ఎన్నో చెట్లు నేలకొరిగాయి. ఐతే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మొంథా తుఫాన్ పెనుగాలికి కూలిపోయేందుకు సిద్ధంగా వున్న ఓ రావి చెట్టును కొంతమంది యువకులు రక్షించారు.
 
ఆ రావి చెట్టును కుర్రాళ్లందరూ కలిసి గట్టిగా పట్టుకున్నారు. ఇసుక బస్తాలు నింపి దాని మొదట్లో కుమ్మరించారు. ఆ తర్వాత ఏకంగా ఓ సిమెంట్ బెంచినీ తీసుకుని వచ్చి ఆ చెట్టును దానికి గట్టిగా తాళ్లతో కట్టేసారు. అలా చెట్టును కూలిపోకుండా రక్షించారు. వృక్షో రక్షతి రక్షితః... మనం చెట్లను సంరక్షిస్తే, అవి మనకు జీవనాధారంగా మారి, మన మనుగడకు తోడ్పడతాయి.
తర్వాతి కథనం
మద్యం తాగి ఇంట్లో పడొచ్చుకదా.. ఇలా రోడ్లపైకి ఎందుకు.. బైకును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన టీచర్ (video)