గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 నవంబరు 2024 (17:01 IST)

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

Lights
కార్తీక పౌర్ణమి నవంబర్ 15 ఉదయం 6:19 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే నవంబర్ 16న తెల్లవారుజామున 2:58 గంటలకు ముగుస్తుంది. ఈ సంవత్సరం దేవ దీపావళి నవంబర్ 15 న జరుపుకుంటారు. ఈ రోజున గంగాస్నానం చేసి అనంతరం దీపదానం చేయండి. ఇలా చేయడం వల్ల 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. 
 
కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో సత్యనారయణ కథను పారాయణం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. 
 
కార్తీక పౌర్ణమి రోజున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ద్వారా జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున, 11 పిండి దీపాలను తయారు చేసి.. ఆ దీపాలను నెయ్యితో వెలిగించాలి. ఈ దీపాలను సాయంత్రం వేళ రావి చెట్టు కింద వెలిగించాలి. తర్వాత రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా శుభ ఫలితాలు వుంటాయి.