న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు గెలుచుకున్న రాజమౌళి
ఎస్ ఎస్ రాజమౌళి ఉత్తమ దర్శకునిగా ఆర్. ఆర్. ఆర్. చిత్రానికి గాను ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును గెలుచుకున్నారు. శనివారం ఈ విషయాన్ని ప్రకటించారు. దీనితో రాజమౌళి మరో అద్భుతమైన ఘనతను నమోదు చేసుకున్నారు. ఈ అవార్డు మోస్ట్ ప్రపంచ దిగ్గజ అవార్డు ఆస్కార్‌కి ఈ చిత్రం సహా రాజమౌళి అతి చేరువలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఆర్. ఆర్. ఆర్. జపాన్ లో ప్రదర్సన జరిగింది. దీనితో ఎస్ ఎస్ రాజమౌళి పేరు మరింత పెరిగింది. రౌద్రం రణం రుధిరం చిత్రం ఇండియాతో పాటు పలు దేశాల అవార్డ్స్ పొందింది. దేశం కోసం పోరాడిన అల్లూరి సీతారాం రాజు, కొమరం భీమ్ పోరాట యోధుల చరిత్రను కల్పితంగా తీసిన రౌద్రం రణం రుధిరంకు న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు పొందటం చాలా గర్వంగా, గౌరవంగా ఉందని రాజమౌళి & టీమ్ తెలియ జేస్తుంది.
రాజమౌళి & టీమ్ కు సినీప్రముఖులు చిరంజీవి వంటి వారు అభినందనలు తెలుపుతూ మీరు మరెన్నో అవార్డులు గెలుచుకోవాలని తెలియజేస్తున్నారు. ఇక రౌద్రం రణం రుధిరం నిర్మించిన డివివి ఎంతో ఆనందం తెలియజేస్తున్నారు.